Nagarjuna’s Oopiri Movie Audio Launch

Nagarjuna’s Oopiri Movie Audio Launch
అక్కినేని నాగార్జున, ‘ఆవారా’ కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో వొస్తున “ఊపిరి” షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చిలో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై ‘బృందావనం’ ‘ఎవడు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఊపిరి’ .గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 1న హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, కార్తీ, ప్రకాష్ రాజ్, జయసుధ, కాజల్ అగర్వాల్, పివిపి,వంశీపైడిపల్లి, అశ్వనీదత్, సుశాంత్, హరీష్ శంకర్, అబ్బూరి రవి, రామజోగయ్యశాస్త్రి, దిల్ రాజు, రఘరామరాజు, సుమంత్, గాబ్రియల్, జెమిని కిరణ్, కళ్యాణ్ కృష్ణ, అడవి శేష్, దశరథ్, తదితరులు పాల్గొన్నారు.
బిగ్ ఆడియో సీడీను అక్కినేని అమల విడుదల చేశారు. ఆడియో సీడీలను అక్కినేని నాగార్జున విడుదల చేసి అమలకు తొలి సీడీని అందించారు.
ఈ సందర్బం లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “శివ’, ‘గీతాంజలి’, ‘నిన్నే పెళ్ళాడతా’, ‘అన్నమయ్య’ సినిమాలకు వచ్చినంత మంచి పేరు ‘ఊపిరి’ సినిమాకు వస్తుంది” అని అన్నరు

Share This Post

Post Comment